వివిధ పోటి పరీక్షలకు శిక్షణ: బీసీ స్టడీ సర్కిల్
💥👉గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ ఎస్ సి, బ్యాంకింగ్ సర్వీసు ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణాతరగతులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సివిల్స్-2022 పరీక్షలు రాసే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 11న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు బాలాచారి తెలిపారు. పరీక్షకు 3,064 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
إرسال تعليق